- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
T Congress: కుట్ర ప్రకారమే బీజేపీ నాయకుల దాడి.. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
దిశ, వెబ్ డెస్క్: లా అండ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేసేలా బీజేపీ చర్యలు ఉన్నాయని, కుట్ర ప్రకారమే బీజేపీ నాయకులు దాడి చేశారని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్(MP Anil Kumar Yadav) అన్నారు. గాంధీభవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ(AICC Leader Priyanka Gandhi)పై బీజేపీ నేత రమేష్ బిధూరీ(BJP Leader Ramesh Bidhuri) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, దీనిపై యూత్ కాంగ్రెస్(Youth Congress) ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన(Protest) తెలపడం జరిగిందన్నారు. బీజేపీ నాయకులు(BJP leaders) ఏ ఒక్కరు కూడా ఇంతవరకు వాళ్ల నాయకుడు మాట్లాడిన మాటలను ఖండించలేదని, దీంతో బీజేపీ నాయకుల ఆలోచన విధానం ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు.
అంతేగాక మొన్న పార్లమెంట్ లో రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడారో మనం చూశామని అన్నారు. ఈ ఘటనలపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన జరుపుతుంటే.. బీజేపీ ఆఫీస్ లోని నాయకులు, కార్యకర్తలు మాపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారని తెలిపారు. బీజేపీ నాయకులు కుట్ర ప్రకారమే ఈ దాడి చేశారని, ఈ దాడి జరిగిన విధానం చూస్తుంటే.. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. గత పదేళ్లు బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు చేశామని, కానీ ఏ రోజు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. కానీ ఇవాళ యూత్ కాంగ్రెస్ నాయకులను రెచ్చగొట్టి ఈ విధంగా దాడులు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ అన్నారు.