గూడెంలకు, తాండలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది : హరీష్ రావు

by Sumithra |
గూడెంలకు, తాండలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది : హరీష్ రావు
X

దిశ, శామీర్ పేట : రాష్ట్రంలోని తాండలను, గూడెంలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని అంతయిపల్లి ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో గిరిజనుల లోకల్ బాడీ ప్రజాప్రతినిధుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిధులుగా విచేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో తండాలోని మహిళలు నీటి కోసం బిందలు మూడు కిలోమీటర్లు నీడిచేవరని, వర్షాల వల్ల విషజ్వరాలు పంజా విసిరితే సిటీ నుండి వైద్యులు వచ్చేవరని కానీ ఈ నాలుగు ఏళల్లో తాండాలలో బస్తీ దావకాణాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.

ఐదు ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి కుడా గిరిజనులకు చేసిన హామీలు నెరవేర్చుకుండా అన్యాయం చేసిందాన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ ఆదివాసులకు నాలుగు లక్షల పై చిలుకు ఎకరాల పోడు భూములును ఇచ్చాడని తెలిపారు. ఎస్టీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా చేసింది,ఎస్సీ ఎస్టీ ల కోసం 70 రెసిడెన్సియల్ డిగ్రీ కాలేజీలు పెట్టి, ఎస్టీ విద్యార్థుల ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు పంపడం కోసం 20 లక్షల ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దేనని అన్నారు. గిరిజనుల తాండలలో, గూడెంలలో 4వేల కోట్లతో బిటీ రోడ్లు, విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేశారని, వైద్య ఉద్యోగాల కోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పించారాని ఈ రిజర్వేషన్ వల్ల గిరిజనులు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఉన్నారని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. లంబాడి హక్కుల పోరాట సమతి సభ్యులు కూడా బీఆర్ఎస్ కె మద్దతు తెలుపుతున్నారని, సేవాలాల్ మహారాజ్ మహిమ ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఓట్లు వేసి చూపించాలని ఈసారి కూడా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక, ఎంపీ మాలోత్ కవిత, మాజీ శశాన సభ్యుడు సత్యనారాయణ, మేయర్ దుర్గ దేవి, రాష్ట్రంలోని సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story