Collector Goutham : నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి

by Aamani |
Collector Goutham : నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా నిర్వహించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు అన్నారు.వినాయక నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా మంగళవారం జిల్లాలోని సుతారి, శామీర్ పేట్, మేడ్చల్ పెద్ద చెరువులలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ...నిమజ్జన విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని కలెక్టర్ ప్రత్యేక అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువులలో లోతు ఎంతవరకు ఉందని, ఎన్ని క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారని అరా తీశారు.

ప్రతి చెరువుల దగ్గర తప్పనిసరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు ఎంత మంది వస్తారనే అంచనాతో సరిపడా మొబైల్ టాయిలెట్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాలు ఒకే చోట నిలిచిపోకుండా దగ్గరగా ఉన్న చెరువులకు మళ్లించాలని కలెక్టర్ సూచించారు. నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కలెక్టర్ ప్రత్యేక అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ స్వామి, డిప్యూటీ తహసీల్దారు సునీల్, ఇరిగేషన్ ఈఈ సునీత, ఏసీపీ వెంకటరెడ్డి, ఎంపిడిఓలు వసంత లక్ష్మి, మమతాబాయి తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్ పర్యటన..

వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మంగళవారం పలు చెరువులను పరిశీలించారు. జిల్లాలోని కాప్రా, సఫిల్ గూడ, అల్వాల్ చెరువులను సందర్శించి, నిమజ్జనం ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్లు శ్రీనివాస్ రెడ్డి, రాజు, తహసీల్దార్లు సుచరిత, రాములు, పోలీసు, ట్రాఫిక్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed