పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకం: మంత్రి మల్లారెడ్డి

by Kalyani |
పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకం: మంత్రి మల్లారెడ్డి
X

దిశ, మేడ్చల్ టౌన్: పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకం అని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తోందని చెప్పారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలతో పాటు మేడ్చల్ జిల్లా ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని మంత్రి అన్నారు. మంగళవారం మేడ్చల్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాకే రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందుతున్నాయని అన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో రూ. 200 ఫించన్ వృద్ధులకు అందజేస్తే తమ ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్న ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. 60 గజాల ప్లాట్ ఉన్న ప్రతి ఒక్కరికి మూడు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత తనదేనని మంత్రి అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జి మహేందర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి రాజశేఖర్ రెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు నంద రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ దీపికా నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story