- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సినీ ఫక్కీలో దొంగతనానికి స్కెచ్..
దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలో ఫేక్ మానవ బాంబు కలకలం సృష్టించాడు. సినీ ఫక్కీలో బ్యాంకులోకి చొరబడి దొంగతనం చేయడానికి స్కెచ్ వేశాడు ఓ ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ఆదర్శ కో ఆపరేటివ్ బ్యాంకు లోకి శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి మాస్క్, ఒంటిపై ఫేక్ మానవ బాంబు ధరించి బ్యాంకు లోకి చొరబడ్డాడు. నేను మానవ బాంబు అమర్చుకున్నాను. నేను బట్టన్ నొక్కితే బ్యాంకు పేలి అందరూ చనిపోతారు అంటూ బాంబు సైరన్ మోగించి భయపెట్టాడు. నాకు బ్యాంకులోని డబ్బులు ఇవ్వండి లేకుంటే బాంబు పేల్చేస్తా అంటూ బ్యాంకు అధికారులు, సిబ్బందిని హడలెత్తించాడు.
దింతో తీవ్ర భయాందోళన చెందిన బ్యాంకు అధికారులు 100 నెంబర్ కు డయల్ చేసి పోలీస్ రక్షణ కోరారు. రంగంలోకీ దిగిన జీడిమెట్ల పోలీసులు మానవ బాంబుగా భయపెడుతున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం అతని వద్ద ఉన్న బాంబుగా చెపుతున్న పరికరాలను పరిశీలించి ఫేక్ బాంబుగా తేల్చారు. కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులు, బ్యాటరీకి ఏర్పాటు చేసి బాంబు సౌండ్ వచ్చేలా సెటప్ చేసినట్లు గుర్తించారు. విచారణలో తన పేరు శివాజీగా తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో పలు కంపెనీలలో డ్రైవర్ గా పని చేసిన శివాజీ ఈజీ మనీ కోసం అలవాటు పడి ఇలాంటి దొంగతనం స్కెచ్ కు రూపకల్పన చేసినట్లు వెల్లండించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుల మేరకు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు జీడిమెట్ల సీఐ సైదులు తెలిపారు.