కొల్తూరు శివారులో అర్థరాత్రి వ్యక్తి దారుణ హత్య

by samatah |   ( Updated:2023-05-18 07:38:30.0  )
కొల్తూరు శివారులో అర్థరాత్రి వ్యక్తి దారుణ హత్య
X

దిశ, శామీర్ పేట :ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామం శివారు ప్రాంతంలో గురువారం వెలుగు చూసింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షిల సాగర్ గ్రామానికి చెందిన గుడ్ల మల్లేష్ 38 ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. మల్లేష్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మృతుడు మల్లేష్ ఫోన్ కాల్ రావడంతో బైటికి వెళ్లేందుకు సిద్ధమాయ్యడు. మృతుడి భార్య లింగవ్వ నువ్వు మద్యం సేవించి ఉన్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్లొద్దు అని మండలించడంతో ఆమె పై చేయచేసుకొని బైటికి వెళ్ళాడు. కొల్తూరు శివారు ప్రాంతంలో రాత్రి హత్యకు గురైయ్యడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. మృతుడు మల్లేష్ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Next Story