స్పెషల్ డ్రైవ్ లో 24 వాహనాలు సీజ్

by Sridhar Babu |
స్పెషల్ డ్రైవ్ లో 24 వాహనాలు సీజ్
X

దిశ, అల్వాల్ : రాంగ్ రూట్ లో ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అల్వాల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నాగరాజ్ అన్నారు. గురువారం సుచిత్ర సర్కిల్, బొల్లారం జంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసి రెండు కేసులు నమోదు అయిన 24 వాహనాలను పట్టుకుని పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని, వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు వివరించారు.

రానున్న రోజుల్లో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠిన తరం కానున్నాయని, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ర్యాస్ డ్రైవింగ్ చేసి ఇతరులకు ఇబ్బందులు కల్గిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి చట్టప్రకారం జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్ పై తమకు కేటాయించిన మార్గంలోనే వాహనాన్ని నడుపాలని వాహనదారులను కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు శ్యాంబాబు, ప్రశాంత్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed