Breaking: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్తత.. హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

by srinivas |
Breaking: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్తత.. హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీ(Medical CMR College) లేడీస్ హాస్టల్‌ బాత్ రూమ్‌లో రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ బుధవారం రాత్రి విద్యార్థినిలు (Students) ఆందోళనకు దిగారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం ఆందోళనను విరమించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హాస్టల్ కిటికీ వద్ద చేతి వేళ్లు గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వారి నుంచి సెల్ ఫోన్లను తీసుకుని పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఇవాళ ఉదయం నుంచి కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరికి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కాలేజీ సెక్యూరిటీ, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. కాలేజీ గేట్లు బంద్ చేయడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు బద్దలు కొట్టుకుని కాలేజీలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ ఎదుల బైఠాయించి కాలేజీ యాజమాన్యం, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనతో కాలేజీ ప్రాంగణం దద్దరిల్లి పోయింది. దీంతో కాలేజీ యాజమాన్యం, అధికారులు దిగొచ్చారు. హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అయినా విద్యార్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. కాలేజీలో విద్యార్థులకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed