MP Raghunandan Rao : యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

by Sridhar Babu |
MP Raghunandan Rao : యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
X

దిశ, చిన్నకోడూరు : యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం రంగనాయక సాగర్ కట్టపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ రేట్, రన్నర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5 కే ,10 కే 21 కే ఆఫ్​ మారథన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపుకూడదని విద్యా ఉద్యోగాల వైపు మొగ్గుచూపి తమ భవిష్యత్తును నిలబెట్టుకోవాలన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మీ ఆశయాలను నెరవేర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు

నిరాశ చెందే విధంగా యువత అడుగులు వేయొద్దు అన్నారు. ప్రతిరోజూ అందరూ క్రీడలతోపాటు, పరుగును అలవాటు చేసుకుంటే వైద్యుల వద్దకు వెళ్లే అవసరం ఉండదు అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. తమ వంతు బాధ్యతగా మొక్కను నాటి సంరక్షించాలన్నారు. నేటి మొక్కలే రేపటి భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నారు. పరుగు పోటీల్లో పాల్గొన్న, నిర్వహించిన వారందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed