- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నా బైక్కే ఎదురు వస్తావా...తగలబెడతా...
దిశ, భిక్కనూరు : నా బైక్కే ఎదురు వస్తావా...తగలబెడతా...అంటూ యువకులు తాగిన మైకంలో ఏకంగా కారు యజమానినే బెదిరించిన ఘటన ఇది. తాగిన మైకంలో స్పీడ్ గా బైకు నడుపుతూ కారు పైకి దూసుకొచ్చి ఎగిరి ఇద్దరూ కిందపడిపోయి స్వల్ప గాయాలతో యువకులు బయటపడిన ఘటన మంగళవారం రాత్రి భిక్కనూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో బైక్ నడుపుతూ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో తప్పంతా బైక్ వాళ్లదే అయినప్పటికీ, ఎదురుగా ఎలా వస్తావు అంటూ కారు నడుపుతున్న వారితో గొడవ పడడమే కాకుండా, క్షమాపణ చెప్పకపోతే కారు కాల్చి వేస్తా అంటూ వాదనకు దిగుతూ హల్ చల్ చేశాడు. సెల్ ఫోన్ లో ప్రమాదానికి సంబంధించి ఫొటోలు తీసేందుకు యత్నించిన యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి సెల్ ఫోన్లు కూడా గుంజుకున్నాడు. ఇంతలో యువకుని తండ్రి వచ్చి తన కొడుకు తో పాటు, ప్రమాదానికి కారకుడైన మరో యువకున్ని రోడ్డుపైన ఎడాపెడ వాయించాడు. ఈలోపు ఏఎస్ఐ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి, ఇద్దరు యువకులను వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.