- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : కాలుష్య బాధిత రైతులకు అండగా ఉంటా
దిశ, జిన్నారం : కాలుష్యంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరిగిన వారికి అండగా ఉంటానని, కాలుష్యాన్ని వదిలే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పరిధిలోని కిష్టాయపల్లి గ్రామానికి చెందిన బశెట్టి సాయికుమార్ అనే రైతుకు సంబంధించిన 18 మూగజీవాలు ఇటీవల కుంటలో కాలుష్య జలాలు తాగి మృతి చెందిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించి స్థానిక పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి, బాధితుడికి నష్ట పరిహారం అందించాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా స్థానిక మోడల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.16 లక్షల నష్టపరిహారం అందించేందుకు అంగీకరించారు. శుక్రవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో రైతు సాయికుమార్ కు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ... కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీబీ ఉన్నతాధికారులకు ఇటీవల సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డపోతారం మాజీ సర్పంచ్ ప్రకాష్ చారి, పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి మూర్తి, స్థానికులు పాల్గొన్నారు.