- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నీరు.. నీరు.. నీరు.. రైతుకంట నీరు..
రైతులతో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి
మార్కెట్ ధర కిలో రూ.ఐదు మాత్రమే
కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్న చందంగా పరిస్థితి
దిశ, ఝరాసంగం : ఉల్లి ధర రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. బహిరంగా మార్కెట్ లో రోజురోజుకూ ఉల్లి ధర పడిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితి కొట్టుమిట్టాడుతున్నారు. లాభాలు లేకున్నా ఫర్వాలేదు, కానీస పెట్టుబడులు వస్తే చాలు ఆనే ఆలోచనలో ఉల్లి రైతులు ఉన్నారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి ధర రూ.800 నుంచి రూ.900 వరకు మాత్రమే పలుకుతుండడంతో రైతులు కన్నీరు మున్నీరుమున్నీరవుతున్నారు. పంట సాగుకు ఒక ఎకరానికి సుమారుగా రూ.30 వేలు ఖర్చవుతోంది.
కానీ, పంట చేతికి వచ్చేసరికి కనీసం కూలీల డబ్బులు కూడా రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం, బర్దిపూర్, కృష్ణాపూర్, మాచునూర్, పొట్టి పల్లి, ఎల్గోయి, చిలేపల్లి, వనంపల్లి, తదితర గ్రామాలలో వేసిన పంట చేతికి రావడంతో కనీస ధర లేకపోవడంతో ఉల్లి పంటను తీయకుండానే పొలాల్లోనే రైతులు వదిలేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కూలీలు సైతం ఉల్లిని నిరాకరిస్తున్నారు. డబ్బులే కావాలని అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు.
దీంతో దిక్కుతోచని స్థితిలో రైతన్న పరిస్థితి ఏర్పడింది. గతేడాది రూ.3 వేలకు పైగా ఉండడంతో ఈ ఏడాది కూడా అదే ధర వస్తుందని భావించి రైతులు జిల్లాలో పెద్దఎత్తున ఉల్లి సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో మార్కెట్‌కు తీసుకొస్తే కిరాయిలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ ను బట్టి క్వింటాకు రూ.800నుంచి రూ.1,000వరకు కొనుగోలు చేస్తూ.. వినియోగదారులకు కేజీ రూ.11 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంటకు ఒక్కసారిగా గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులకు ఏమి చేయని దీనస్థితిలో ఉన్నారు రైతులు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామానికి చెందిన ఓ యువ రైతు తన రెండు ఎకరాల పొలంలో ఉల్లి పంటను పండించారు. పెట్టుబడి కాదు కదా కేవలం ఆయనకు గత రాత్రి మార్కెట్ కు తరలిస్తే రూ.7,718 మాత్రమే వచ్చాయి. ఉల్లి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కొందరు రైతులు ఏమో ఉల్లికి ధర లేకపోవడంతో కిరాయి ఇల్లు, తీసుకొని కిరాయి రూములు తీసుకొని ఉల్లిని నిల్వ చేస్తున్నారు. మరికొందరు రైతులు చేసేది ఏమీ లేక మార్కెట్ తరలిస్తున్నారు.