వాటర్ మ్యాన్ నిర్వాకం…పంటపొలాలకు మిషన్ భగీరథ నీరు

by Kalyani |
వాటర్ మ్యాన్ నిర్వాకం…పంటపొలాలకు మిషన్ భగీరథ నీరు
X

దిశ, కొమురవెల్లి : పంటపొలాలకు మిషన్ భగీరథ నీటిని వదిలి వాటర్ మ్యాన్ మరోసారి తన కుటిల బుద్దిని చాటుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాస్ పల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామంలో నీటి ఎద్దడి ఉన్న గత వేసవిలో పంట పొలాలకు నీటిని వదలగా ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ట్యాంక్ ఓవర్ ఫ్లో చేసి పంట పొలాలకు నీటిని వదిలి వాటర్ మ్యాన్ సిద్దులు తమ నిర్వాహకంను బయట పెట్టుకున్నాడు. గ్రామంలో నీటి ఎద్దడితో మహిళలు కాలి బిందెలతో ఆందోళనలు చేసి , రోడ్డెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇళ్లకు సరిపడా మిషన్ భగీరథ నీటిని వదలకుండా, తాగునీటిని పంటపొలాలకు వదలడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story