Raw milk: పచ్చిపాలు తాగకూడదనడానికి సైంటిఫిక్ రీజనిదే..?

by Anjali |
Raw milk: పచ్చిపాలు తాగకూడదనడానికి సైంటిఫిక్ రీజనిదే..?
X

దిశ, వెబ్‌డెస్క్: పాల(MILK) వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రతి రోజూ ఉదయం గ్లాస్ పాలు తాగితే.. శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీ పవర్‌‌‌(Immunity power) అందుతుంది. దంతాలను హెల్తీ(Healthy teeth)గా ఉంచుతాయి. అంతేకాకుండా బోలు ఎముకల వ్యాధి(Osteoporosis) దరిచేరకుండా చూస్తాయి. పాలు చర్మానికి(skin) కూడా మేలు చేస్తాయి. హృదయ నాళ ఆరోగ్యానికి(Cardiovascular health) పాలు ఎంతో మంచివి. పాలు తాగితే జుట్టు(Hair health) కూడా హెల్తీగా ఉంటుంది. జీర్ణక్రియ(digestion)కు తోడ్పడటమే కాకుండా.. నిరాశను ఎదుర్కోవటానికి సహాయం చేస్తాయి. అయితే ఇన్ని ప్రయోజనాలున్న పాలు వేడి చేసుకుని తాగితే ఏం కాదు.. కానీ పచ్చిపాలు తాగకూడదంటారు వైద్య నిపుణులు. ఎందుకు తాగకూడదో చాలా మందిలో ఈ ప్రశ్న తలెత్తే ఉంటుంది. దీనికి ఓ సైంటిఫిక్(Scientific) కారణముంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చిపాలల్లో ఫ్లూ వైరస్(Flu virus) దాదాపు ఐదు రోజుల వరకు సజీవంగా ఉంటుందని.. కాగా తాగాలంటే పలు జాగ్రత్తలు అవసమని తాజాగా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు(Stanford University researchers) వెల్లడించారు. కాచిన పాల కంటే పచ్చి పాలల్లో ఎంజైమ్‌లు(Enzymes), పోషకాలు(Nutrients), ప్రోబయోటిక్స్(Probiotics) ఎక్కువగా ఉంటాయని పలువురు భావిస్తారు. కానీ అలా తాగితే ఆరోగ్యం నశిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పచ్చిపాలు తాగితే.. ఏకంగా 200 లకు పైగా వ్యాధులు దరి చేరే ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు. సాల్మొనెల్లా(Salmonella), కోలై (Kolai) వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు(Bacterial infections) వస్తాయని తెలిపారు. కాగా పచ్చిపాలు తాగాలనుకునే వారు గ్యాస్ సిమ్‌లో ఉంచి 161° F వరకు వేడి చేయండి. తర్వాత పదిహేను సెకన్ల పాటు అదే ఉష్ణోగ్రతలో ఉంచి.. పక్కకు తీసుకోవాలి. దీంతో క్రిములు నశిస్తాయి.. పోషకాలు కూడా పోకుండా ఉంటాయని నిపుణులు సూచించారు.ల

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story