Wholesale Inflation: మూడు నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

by S Gopi |
Wholesale Inflation: మూడు నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్టానికి తగ్గింది. కీలకమైన కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశ టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) నవంబర్‌లో 1.89 శాతానికి దిగొచ్చినట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 2.36 శాతం ఉండగా, గతేడాది నవంబర్‌లో ఇది 0.38 శాతంగా నమోదైంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో ఆహార పదార్థాల హోల్‌సేల్ ధరలు 13.54 శాతం నుంచి 8.63 శాతానికి తగ్గాయి. కూరగాయల ధరలు 63.04 శాతం నుంచి 28.57 శాతానికి పడిపోయాయి. గత నెలలో ఉల్లి ధరలు 2.85 శాతం తగ్గాయి. కూరగాయలలో ఉల్లిపాయ, టొమాటో ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణానికి సానుకూలంగా మారింది. వాటితో పాటు ముల్లంగి, దోసకాయ, బీన్స్ ధరలు తగ్గాయి. అలాగే, అక్టోబర్‌లో 5.79 శాతంగా ఉన్న ఫ్యూయెల్, ఎనర్జీ విభాగం గత నెలలో 5.83 శాతానికి చేరింది. తయారీ ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం 2 శాతానికి పెరిగింది. ఇటీవల రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం కంటే ఎక్కువగా నమోదైన నేపథ్యంలో తాజా టోకు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వచ్చే ఫిబ్రవరిలో రేట్ల తగ్గింపునకు మద్దతుచ్చే అవకాశం ఉందని ప్రముఖ బార్‌క్లేస్ చీఫ్ ఎకనామిస్ట్ ఆస్తా గుద్వానీ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed