- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్ : నర్కుడలో వరద కాలు కబ్జాకు విముక్తి
దిశ, శంషాబాద్ : ప్రభుత్వ భూములు, వరద కాలువలను ఎవరు ఆక్రమించిన చర్యలు తప్పవని తహసిల్దార్ రవీందర్ దత్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడలో వరద కాలువను ఆక్రమించి మట్టిని నింపారని ఆదివారం దిశ పత్రికలో వచ్చిన శీర్షికకు ఇరిగేషన్ రెవెన్యూ, అధికారులు స్పందించి వరద కాలును ఆక్రమించి మట్టి నింపిన భూమిలో నుంచి ఇరిగేషన్ ఏఈ మౌనిక దగ్గరుండి జేసిబితో మట్టిని తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నర్కుడ రెవెన్యూ పరిధిలో శంషాబాద్- షాబాద్ ప్రధాన రహదారి లో ఉన్న వరద కాలువకు అడ్డంగా మట్టిని నింపి అక్రమంగా ప్రహరీ నిర్మిస్తున్నారని దిశ పత్రికలో రావడం జరిగిందన్నారు.
అందులో భాగంగా వరుద కాలువలను పరిశీలించి వరద కాలంలో నింపిన మట్టి ఇరిగేషన్ అధికారుల సహాయంతో మట్టిని పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. వరద కాలువలలో మట్టి నిండిన వారికి కూడా మరోసారి ఇలాంటి చర్యలకు పాలు పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించామన్నారు. ప్రభుత్వ భూములు, వరద కాలువలు, సీలింగ్ భూములు, చెరువులు, కుంటలు, నాళాలలో, మండలంలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు అక్రమాలు జరిగితే నేరుగా తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు. ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.