- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెల్లంపల్లి బల్దియాకు డంపు యార్డు స్థలం కరువు..!
దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా రెండో శ్రేణి గ్రేడ్ బెల్లంపల్లి మున్సిపాలిటీకి డంపు యాడ్ కష్టాలు తప్పడం లేదు. డంపు యార్డు సౌకర్యం లేక ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేస్తున్నారు. ఈ పని చేసేది ప్రజలు కాదు సాక్షాత్తు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చేయడం గమనార్హం. ఇలా పారిశుద్ధ్య సిబ్బంది వ్యవహరించడానికి ప్రధాన కారణం డంపు యార్డు లేకపోవడమే. కాగా మున్సిపల్ అధికారులు, పాలకమండలిలో చిత్తశుద్ధి లోపించడమే ఇందుకు కారణం అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన బెల్లంపల్లి మున్సిపాలిటీలో డంపు యార్డు లేకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు ఆశ్చర్యపోతున్నారు. పట్టణంలో 34 వార్డులు ఉన్నాయి. వార్డుల రీత్యా మున్సిపాలిటీ గరిష్ట స్థాయి అని చెప్పనక్కర్లేదు.
చెత్తపై చిత్తశుద్ధి లేదు..
డంప్ యాడ్ పై పురపాలక మండల కి ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పట్టణంలోని 34 వార్డుల్లోని సేకరించిన చెత్తను ఎక్కడ డంపు చేయాలో అర్థం కాని పరిస్థితిలో పారిశుద్ధ సిబ్బంది ఉన్నారు. నిత్యం విధి నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికులు చెత్తను ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతినిత్యం చెత్తను పట్టణ శివారులో డంపు చేసి కార్మికులు హమ్మయ్య ఈరోజు ఇలా గడిచిపోయిందిని ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉందంటే అతియోశక్తి కాదు. చెత్తను పడేయడానికి కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారు.
స్మశాన వాటికలే దిక్కయ్యాయి..
డంపు యాడ్ సౌకర్యం లేక పారిశుద్ధ్య సేకరించిన చెత్తను స్మశాన వాటికల్లో పడేస్తున్నారు. కుప్పలు కుప్పలుగా చెత్తకుప్పలు పేరుకుపోయి స్మశాన వాటికలు కనుమరుగవుతున్నాయి. సమాధుల పక్కన చెత్తను పడేస్తున్నారు. ఇంక్లైన్ బస్తీ, కన్నాల బస్తి మార్కెట్ యార్డ్ వెనుకాల పోచమ్మ చెరువు స్మశాన వాటికలో చెత్తను పడేస్తున్నారు. చెత్త కుప్ప లు పేరుకొని వర్షానికి తడిసి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. గురజాలకు వెళ్లే రహదారి పక్కనే డంపు చేసిన చెత్త కుప్పలు అందుకు నిదర్శనం. దీంతో వాహనదారులు చెత్తకుప్పల దుర్వాసనతో ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అధికారులు, పాలకమండలి బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం వల్లనే డంప్ యాడ్ కు పరిష్కారం లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఉమేష్ చంద్ర రోడ్డు లో డంపు యాడ్ ఏర్పాటుకు అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే డంపు యాడ్ కు ఎంపికైన స్థలం వివాదాస్పదమైనది కావడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక అప్పటినుండి అధికారులు డంపు యాడ్ ఏర్పాటుపై చేతులెత్తేశారు.
బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో పూర్వం ఏర్పాటుచేసిన డంప్ యాడ్ ను ప్రజలు ఎత్తివేయాలని ఆందోళన చేశారు. డ డంపు యాడ్ లోని చెత్తను వ్యర్థ పదార్థాలను మున్సిపల్ కార్మికులు దహనం చేశారు. దగ్ధమైన చెత్త వల్ల వెదజల్లే పొగ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కన్నాల బస్తీ, మధునన్ననగర్, కొత్త బస్టాండ్ వరకు దట్టమైన పొగ తో ప్రజలు ఊపిరి సెల్పుకోలేదు పరిస్థితి నెలకొంది. దినదినం ఈ సమస్యతో ప్రజలు అనారోగ్య బారిన పడ్డారు. దీంతో డంపు యాడ్ ను ఎత్తివేయాలని ప్రజలు ఆందోళన చేశారు. దీంతో డంపు యాడ్ ను అక్కడినుండి ఎత్తివేయక తప్పలేదు. ఇక అప్పటి నుంచి డంప్ యార్డ్ కు తగిన స్థలం దొరకక కాలయాపన అవుతుంది. అధికారుల చిత్తశుద్ధి లేని పాలకమండలి నిర్లక్ష్యం వెరసి బెల్లంపల్లిలో డంపు యాడు ఏర్పాటుకు ముహూర్తం రావడం లేదు. ప్రజల అవస్థలను తీవ్రంగా పరిగణించి కొని అధికారులు, పాలకమండలి డంపు యార్డు ఏర్పాటుపై చిత్తశుద్ధి కనపరచాలని ప్రజలు కోరుతున్నారు. పాలకమండలి పదవీకాలం ముగింపు సమీపంలో ఉంది. ఈలోగా డంప్ యార్డు ఏర్పాటు చేసి ప్రజల వాంఛను తీర్చిన వారైతారు. లేదా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి ప్రజల విమర్శలను మూటగట్టుకుంటారా ? పురపాలక మండలి తేల్చుకోవాలి