Gunturu : కిడ్నాపర్ల నుంచి తెలివిగా తప్పించుకున్న బాలిక

by M.Rajitha |
Gunturu : కిడ్నాపర్ల నుంచి తెలివిగా తప్పించుకున్న బాలిక
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు(Gunturu) జిల్లాలో కిడ్నాపర్ల చర్య నుంచి ఓ బాలిక తెలివిగా తప్పించుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని వెంగళరావునగర్లో తల్లికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి కిడ్నాపర్లు బాలికను కారులో ఎత్తుకు వెళ్లారు. విజయవాడలో దుండగులు భోజనం చేయడానికి దిగినపుడు, డోర్ లాక్ పడని విషయాన్ని గమనించిన బాలిక తప్పించుకొని విజయవాడ బస్టాండ్(Viyawada RTC Bustand) కంట్రోల్ రూమ్ సిబ్బందికి జరిగిన విషయం తెలిపింది. అప్రమత్తమైన సిబ్బంది వెనటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగానే కిడ్నాపర్లు కారు వదిలేసి పారిపోయాయి. దుండగులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాలిక చాకచక్యంగా వ్యవహరించిన తీరును అందరూ ప్రశంసించారు.

Advertisement

Next Story