- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Congress: ‘నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే’.. అధిష్టానం ఎదుట తెగేసి చెప్పిన మాజీ ఎంపీ?
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివాదం రాజుకుంది. ఈ మీటింగ్‌లో ఏఐసీసీ(AICC) ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ(Deepa Dasmunsi), మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సమక్షంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) తన మనసులోని మాట బయటపెట్టారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. కుమారుడు అనిల్‌కు రాజ్యసభ ఇచ్చారు ఇంకేంటి? అని ఓ వర్గం వాదించగా.. అయితే, తనకు మంత్రి పదవి ఇవ్వకూడదా? అని అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. వివాదం ఎంతకీ ఆగకపోవడంతో దీపాదాస్ మున్షీ అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కొలువుదీరి ఏడాది పూర్తయింది. కానీ.. మంత్రివర్గం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. దీనికి అనేక రాజకీయ కారణాలు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై సీఎం, మంత్రులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆశావహులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నా్యి. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.