Adivi Sesh: ‘డెకాయిట్’ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Hamsa |   ( Updated:2024-12-16 11:20:46.0  )
Adivi Sesh: ‘డెకాయిట్’ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్(Adivi Sesh) ‘క్షణం’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హిట్-1, హిట్-2, గూఢచారి(Goodachari ), మేజర్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’(Dacoit). లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు షానెల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అయితే దీనిని అన్నపూర్ణ స్టూడియోస్‌(Annapurna Studios) బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్(Sunil Narang) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా, అడివి శేష్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘‘తనని కాపాడినా.. కానీ ఒదిలేసినాది.. తను ఏంటో.. అసలెవరో రేపు తెలిసొస్తాది. ఉదయం 11: 30 గంటలకు అప్డేట్ రాబోతుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే కారు డోర్ వద్ద ఓ అమ్మాయితో నిల్చున్న పోస్టర్ విడుదల చేశాడు. ఇందులో ఓ అమ్మాయి గన్ పట్టుకుని ఎవరికో గురి పెట్టినట్లు కనిపించగా.. అడివి శేష్ గాయాలతో ఆమె ముఖానికి చేయి అడ్డుపెట్టి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఉన్నది శృతి హాసన్(Shruti Haasan) లేక మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హా అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

Advertisement

Next Story