Ilayaraja : శ్రీవిల్లిపుత్తూర్‌ ఆండాళ్‌ ఆలయంలో ఇళయరాజకు ఘోర అవమానం

by M.Rajitha |
Ilayaraja : శ్రీవిల్లిపుత్తూర్‌ ఆండాళ్‌ ఆలయంలో ఇళయరాజకు ఘోర అవమానం
X

దిశ, వెబ్ డెస్క్ : మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Music Mastro Ilayaraja)కు ఘోర అవమానం జరిగింది. తమిళనాడు(Tamilanadu)లోని శ్రీవిల్లిపుత్తూర్‌ ఆండాళ్‌ ఆలయ(SriVilliputhur Andal Temple) సందర్శనలో భాగంగా ఇళయరాజా గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపం(Artha Mantapam)లోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జీయర్‌ స్వామీజీలు ఇళయరాజాను అక్కడ నుంచి వెనక్కి పంపించారు. ఇళయరాజా గుడి నుంచి బయటకు వచ్చిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది ఇళయరాజాకి జరిగిన ఘోర అవమానం అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ఇళయరాజాకి అవమానం జరిగిందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను వారు కొట్టిపారేశారు. ఆయనకు పూర్తి గౌరవ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించామని అన్నారు. అయితే జీయర్‌లకు మాత్రమే ఎంట్రీ ఉన్న అర్ధ మండపంలోకి తెలియకుండా ఇళయరాజా వెళ్లారని, ఆయనకు విషయం చెప్పిన వెంటనే బయటకు వచ్చారని, ఆండాళ్‌ స్వామి వారిని బయట నుంచి దర్శించుకున్నారని వివరించారు. ఆలయ నియమాలకు విరుద్ధంగా ఇతరులు ఎవరూ మండపంలోకి వెళ్లకూడదని, ఈ విషయంలో ఇళయరాజాను అవమానించడం తమ ఉద్దేశం కాదని, ఆయనపై తమకు గౌరవ మర్యాదలకు కొదువ లేదు అంటూ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇళయరాజా ఈ విషయం మీద స్పందించాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed