వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం.. పాల్గొన్న ఎంపీ రఘునందన్

by Nagam Mallesh |
వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం.. పాల్గొన్న ఎంపీ రఘునందన్
X

దిశ, దుబ్బాకః బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఎంపీ దంపతులు వెంకటేశ్వర స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వాదం ఇచ్చారు. ఎంపీ మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాధంతోనే మొదటి సారిగా ఎమ్మెల్యే గా, ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఎంపీగా గెలిచానని తెలిపారు. రైతుల కష్టాలు తీరి పాడిపంటలతో విరాజిల్లాలని స్వామివారిని అమ్మవార్లకు కోరుకున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed