తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం : కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

by Sumithra |
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం : కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల
X

దిశ, నర్సాపూర్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురడం ఖాయమని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. నర్సాపూర్ మండలం గొల్లపల్లి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ సంయుక్త మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రధానితో జరుపుకోవడం దేశం గర్వించ తగ్గ విషయమని అన్నారు. దేశం విపత్కరమైన సమయంలో తన తెలివితేటల తో భారతదేశాన్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. కరోనా వల్ల భారతదేశం నాశనమవుతుందని ప్రపంచం అనుకున్న సమయంలో చాకచక్యంగా కరోనా భారీ నుండి భారతదేశాన్ని కాపాడారని మంత్రి అన్నారు.

భారతదేశం ప్రపంచంలో ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ లను సప్లై చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని అన్నారు. ఇతర దేశాలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకోగల సమర్ధుడు నరేంద్ర మోడీ అని తెలిపారు. చైనా భారత్ సరిహద్దు వివాదాన్ని చాకచక్యంగా నిర్వర్తించి భారతదేశ సత్తాని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. భారతదేశాన్ని ఒక్క తాటిపై తీసుకువచ్చి ప్రపంచ దేశాలకు సహాయం చేసే స్థితికి తీసుకొచ్చారని, కేంద్రం నుంచి వచ్చే నిధులు గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు నేరుగా చేరే విధంగా ప్రధాని మోడీ చేశారని అన్నారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో భారతదేశం ఇతర దేశాలకు సహాయం చేసే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు కేంద్రమంత్రి ఘనంగా సన్మానించారు. బీజేపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపి, నియోజకవర్గ ఇంచార్జ్ వాల్దాస్ మల్లేష్ గౌడ్ తో పాటు నియోజవర్గం అని మండలం చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story