అక్కడ ఫ్లెక్సీ వార్.. ఆధ్యాత్మిక ఫ్లేక్సీలను చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు..

by Vinod kumar |
అక్కడ ఫ్లెక్సీ వార్.. ఆధ్యాత్మిక ఫ్లేక్సీలను చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
X

దిశ, పటాన్ చెరు: ఫ్లెక్సీల చించివేత లొల్లి పఠాన్ చెరు ప్రాంతంలో కామన్ అయిపోయింది. గత దసరా నుండి మొదలైన ఫ్లెక్సీల చించివేత పర్వం కొనసాగుతూనే ఉంది. రాజకీయ మీటింగ్ల ను వదిలి గ్రూప్ రాజకీయాల సెగ ఆధ్యాత్మిక కార్యక్రమాల వరకు ఫ్లెక్సీల రగడ కొనసాగుతుంది. ఈ నెల 18 న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్, ఎన్.ఎం.ఆర్ యువసేన ఆధ్వర్యంలో మహాశివరాత్రి ని పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో శివోత్సవం పేరుతో శివ రాత్రి జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఏర్పాట్లలో భాగంగా అతిథులకు, భక్తులకు స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున లింగంపల్లి చౌరస్తా నుండి చిట్కుల్ వరకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏర్పాట్లను జీర్ణించుకోలేని వ్యతిరేక వర్గం నీలం మధు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలని ఎక్కడిక్కకడ చింపి వేశారు. భక్తి భావంతో రాజకీయాలకతీతంగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపడంపై ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాలకు సంబంధించిన విభేదాలుంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప భక్తి భావంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించడం చూడడం అవివేకమైన చర్య అని నీలం మధు సన్నిహితులు ఫైర్ అవుతున్నారు. కొన్నిచోట్ల ఓర్వలేక ఫ్లెక్సీలను చంపితే మరికొన్ని చోట్ల కార్యక్రమం పూర్తికాకుండానే ఫ్లెక్సీలను తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫ్లెక్సీలో చించివేత వ్యవహారంపై గురువారం ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి ఫ్లెక్సీలు చంపిన దుండగులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరుసగా జరుగుతున్న ఫ్లెక్సీల చించివేత పంచాయతీ తీవ్ర రూపం దాల్చి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోక ముందే ఈ ఘటనలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.

Advertisement

Next Story

Most Viewed