- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థుల పాలిట శాపంగా మారిన నిమిషం నిబంధన
దిశ, సిద్దిపేట ప్రతినిధి : నిమిషం నిబంధనతో ఇద్దరు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయినా సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన సీఈసీ, ఎంపీసీ ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షా సమయం లోపే పరీక్ష కేంద్రానికి వచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ పరీక్షా కేంద్రంలోని సిబ్బంది ఆలస్యంగా వచ్చినట్లు తెలుపుతూ పరీక్షా కేంద్రం వెలుపలికి పంపినట్లు పేర్కొన్నారు. కాగా ఎంపీసీ విద్యార్థి అభిషేక్ పరీక్షా కేంద్రంలోకి వెళ్లి ఓఎంఆర్ షీట్ పై కాల్ నెంబర్, బుక్ లెట్ నెంబర్ రాసినట్లు తెలిపారు. బుక్ లేట్ పై వివరాలు రాసిన తర్వాత పరీక్ష హాల్ నుండి బయటికి పంపినట్లు విద్యార్థి ఆరోపించాడు. ఈ మేరకు విద్యార్థి తల్లిదండ్రులకు పరీక్షా కేంద్రం సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.