కరీంనగర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్

by Shiva |
కరీంనగర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్
X

దిశ, హుస్నాబాద్ : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లకు కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. బుధవారం ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుక ఎల్లమ్మను పార్టీ శ్రేణులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకుని తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.

తెలంగాణను సోనియాగాంధీ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో అది నెరవేరిందా లేదా అని ప్రజలు గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలన్నారు. దశాబ్ధ కాలంలో వందేళ్లు బ్రతికేంత ఆస్తులను సీఎం కేసీఆర్ కుటుంబం సంపాదించుకుందని ఆరోపించారు. తెలంగాణ విభజన సమయంలో రూ.60వేల కోట్లుగా ఉన్న అప్పు ఇప్పుడు రూ.6 లక్షల కోట్లకు చేరిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. బీఆర్ఎస్ అంటే ట్యాంక్ బండ్లు, రోడ్డు డివైడర్లు, స్ట్రీట్ లైట్లు తప్ప మరేమి లేదన్నారు.

Advertisement

Next Story