- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడుపాయల్లో హుండీల చోరీ.. భారీగా కానుకలు మాయం..
దిశ, పాపన్నపేట, మెదక్ ప్రతినిధిః దొంగలు పాపన్నపేటలో బీభత్సం సృష్టించారు. ఏకంగా దేవుడి హుండీనే ఎత్తుకెళ్లారు. మండలంలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు పడ్డారు. ఇద్దరు దుండగులు గర్భగుడి ముందు ఉన్న రెండు హుండీలను పాత కళ్యాణ కట్ట, ముని పుట్టకు వెళ్లే దారి వద్దకు ఎత్తుకెళ్లి అక్కడ హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, అభరణాలను అపహరించారు. అమ్మవారి గర్భగుడిలో రెండు హుండీలు ఉండగా, గర్భగుడి ముందు మరో రెండు హుండీలు ఏర్పాటు చేశారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి ఆలయ పూజరులు తాళం వేసి వెళ్ళిపోయారు. అర్థరాత్రి సమయములో వచ్చిన దొంగలు తాళాలు పగలకొట్టి గర్భగుడి ముందు ఉన్న రెండు హుండీ లను ఎత్తుకెళ్ళారు. గత పది రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, కానుకలు చోరికి గురయ్యాయి. ఈ తరహా ఘటనలే గతంలో కూడా చోటు చేసుకున్నాయి. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. చోరికి పాల్పడింది ఇద్దరు వ్యక్తులుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలిసిందని, విచారణ తరవాత పూర్తి వివరాలు తెలియజేస్తామని వివరించారు.