- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధిష్టానం పెద్దలు ఫోన్‌లు లేపకుండా అవమానించారు : బాబు మోహన్
దిశ, అందోల్: నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఎన్నికల ప్రచారం చేయనని, రాజకీయాలకు దూరంగా ఉంటానని సీనినటుడు, మాజీ మంత్రి పి.బాబూమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధిష్టానం విడుదల చేసిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆసహనానికి గురైన ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. తొలి జాబితాలో తన పేరు ఎందుకు చేర్చలేదన్న విషయాన్ని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఫోన్ చేస్తే, కనీసం వారు ఫోన్ కూడా లేపకపోవడం నన్ను కలిచివేసిందన్నారు. అందోలు టిక్కెట్ విషయాన్ని పార్టీ పెద్దలను ప్రశ్నించేందుకే మీడియా ద్వారా సమావేశాన్ని పెట్టానన్నారు.
తనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్న విషయాన్ని పార్టీ పెద్దలు చెప్పోచ్చు కదా అని అయన అన్నారు. తాను పదవుల కోసం పార్టీలో చేరలేదని, పదవులు నాకు కొత్తేమి కాదన్నారు. తానుగా బీజేపీలో చేరలేదని, పార్టీ పెద్దలు ఆహ్వనిస్తేనే బీజేపీలో చేరానని, పార్టీ అభివృద్దికి గత ఐదేళ్ల కాలంలో ఎంతగానో కృషి చేసానన్నారు. బీజేపీ పార్టీ పక్షాన 14 రాష్ట్రాల్లో ప్రచారం చేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేశానన్నారు. మీ పార్టీ టిక్కెట్ నా కొద్దని, తాను ఎన్నికలకు, ప్రచారానికి దూరంగా ఉంటానని, ఎవరికైనా ఇచ్చుకొండని చెప్పారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు స్పందించిన విధానాన్ని బట్టి పార్టీలో ఉండాలా? వద్దా అన్న నిర్ణయం ఉంటుందన్నారు. ఆత్మభిమానం చంపుకుని పనిచేయాలా? రాజీనామా కూడా చేయవచ్చునన్నారు. నా కొడుకు కు పార్టీ టిక్కెట్ ఇస్తే సంతోషమేనని, కానీ నేను ప్రచారానికి వేళ్లనని ఆయన తెల్చిచెప్పారు.
తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తండ్రి, కొడుకుల మధ్య పోటీ ఎంటని ఆయన ప్రశ్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని, మంచి పేరును తెచ్చుకున్నాన ని, కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులను చేపట్టిన ఒక్కరూపాయి లంచం తీసుకొకుండా నిజాయితీగా ఉన్నానన్నారు. నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకం ప్రారంభంకాకముందే తాను సింగూరు నీటిని తాగుకు అందించానని, డబుల్ బేడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. చెరువుల స్థలాల్లో ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారన్నారు. రాజకీయ నాయకులకు అబద్దాలు చెప్పడం సర్వసాధారణమే కానీ తాను ఏనాడు అబద్దాలు చెప్పి, ఎవ్వరిని మోసం చేయలేదన్నారు. ఇదిలావుండగా బాబూమోహన్ ప్రెస్ మీట్‌పై అందోలు నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.
అందోలు ప్రజలు క్షమించండి:
అందోలు నియోజకవర్గ ప్రజలతో 25 ఏండ్ల పాటు అనుబంధం ఉందన్నారు. నాకు మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసే అవకాశాన్ని కల్పించారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం కూడా నాకు బాధను కలిగించింది. కొందరు కుట్రలు చేసి నన్ను మనోవేదనకు గురిచేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. నా స్థాయికి మించి అభివృద్ది పనులను చేశానని, నియోజకవర్గ ప్రజలను ఎన్నడూ మరిచిపోనని ఆయన తెలిపారు. అందోలు నియోజకవర్గ ప్రజలు పెద్ద మనస్సుతో నన్ను క్షమించండని కొరుకుంటునన్నారు.