ప్రాథమిక సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి..

by Kalyani |
ప్రాథమిక సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి..
X

దిశ, కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గేటు వద్ద నూతనంగా నిర్మించిన మహమ్మద్ నగర్ ప్రాథమిక సహకార సంఘం పరపతి భవనమును( పీఏసీసీఎస్) రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha )సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు యం. రఘునందన్ రావు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ చిన్న చిన్నం రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, సొసైటీ సంఘం డైరెక్టర్లు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed