రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో వేయాలి

by Sridhar Babu |
రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో వేయాలి
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : రైతులకు అందించే రుణమాఫీ డబ్బులు నేరుగా వారి సేవింగ్ ఖాతాలో వేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు బ్యాంకు అధికారులను ఆదేశించారు. శనివారం కంది మండల పరిధిలోని ఇంద్రకరణ్ గ్రామంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రైతు రుణమాఫీ ఖాతాలను ఆమె పరిశీలించారు. రైతులు తీసుకున్న పాత రుణాలను రెన్యువల్ చేసి వారికి త్వరగా కొత్త రుణాలను అందజేయాలని సూచించారు.

జిల్లాలో కుక్కల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకోవాలి

కంది మండల పరిధిలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కాశీపూర్ కుక్కల బర్త్ కంట్రోల్ సెంటర్ (ఏబీసీ) పరిశీలించారు. జిల్లాలో కుక్కల సంఖ్యను తగ్గించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

స్టెరిలైజేషన్ చేసిన కుక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో గుర్తించిన కుక్కలను ఏబీసీ సెంటర్ కు తరలించి కుక్కలకు బర్త్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పుటి వరకు 1105 కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినట్టు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిని వసంతకుమారి, జిల్లా కలెక్టర్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed