అక్రమ సర్వేను అడ్డుకున్న రైతులు.. ఉడాయించిన అధికారులు, సర్వే పెట్టుకున్న రైతు..

by Kalyani |
అక్రమ సర్వేను అడ్డుకున్న రైతులు.. ఉడాయించిన అధికారులు, సర్వే పెట్టుకున్న రైతు..
X

దిశ, మనోహరాబాద్: గతంలో రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించి ఓ వ్యక్తి అక్రమంగా భూమిని ఆక్రమించుకొని రిజిస్త్రేషన్ చేసుకుని పట్టా పొంది సర్వే పెట్టుకున్నాడు. దీంతో అధికారులు ఆ భూమిని సర్వే చేసి హద్దులు పాతడానికి చుట్టుపక్కన రైతులకు నోటీసులు జారీ చేశారు. దీంతో గురువారం సర్వే చేయడానికి వచ్చిన అధికారులను, అక్రమంగా పట్టా పొందిన వ్యక్తిని అడ్డుకోగా పరిస్థితి విషమించడంతో వారు గ్రామం నుంచి కారులో ఉడాయించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 126 లలో దాదాపు మూడు ఎకరాల భూమిని, గతంలో అప్పటి రెవెన్యూ అధికారులకు మామూల్లు అందజేసి వేలూరు ప్రభాకర్ గిరిధర్ అనే వ్యక్తి కేవలం రికార్డులను సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని స్థానిక రైతులు ఆరోపించారు.

అక్రమార్కుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తన భూమి ఎక్కడుందో తెలియకపోవడంతో రెవెన్యూ అధికారులకు సర్వే కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. దీంతో ఈ నెల 2వ తేదీన సర్వే అధికారులు ఈ భూమిని సర్వే చేస్తామని చుట్టుపక్కన ఉన్న దాదాపు 60 మంది రైతులకు నోటీసులు అందజేశారని చెప్పారు. ఈ నెల 9వ తేదీన సర్వే చేస్తామని నోటీసులో పేర్కొన్నట్లు తెలిపారు. ఇచ్చిన నోటీసుల ప్రకారం గురువారం రెవెన్యూ అధికారులు, సర్వేయర్, అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి గ్రామానికి రావడంతో ఒక్కసారిగా నోటీసులు పుచ్చుకున్న రైతులు ఆందోళనకు దిగి అడ్డుకున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు, అక్రమార్కుడు గ్రామం నుంచి ఉడాయించారు.

కాగా గతంలో రెవెన్యూ అధికారులు అక్రమార్కుని వద్ద పెద్ద మొత్తంలో లంచాలు పుచ్చుకొని అక్రమంగా వేలూరు ప్రభాకర్ గిరిధర్ అనే వ్యక్తికి కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసి రికార్డుల్లో నమోదు చేశారని గ్రామస్తులు తెలిపారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి ఎక్కడుందో తనకు తెలియకపోవడంతో అధికారులను పట్టుకొని సర్వే చేయించుకొని అక్రమంగా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించాడని గ్రామస్తులు, రైతులు ఆరోపించారు.

Advertisement

Next Story