- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Police Commissioner : నేరాల నియంత్రణలో జిల్లా ముందుండాలి
దిశ, చిన్నకోడూరు : దుర్గదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దకోడూరు శివారులోని సాయుధ దళాల కార్యాలయంలో శుక్రవారం ఆయుధ పూజ, జమ్మి చెట్టు, ప్రభుత్వ వాహనాలకు పోలీసు కమిషనర్ డాక్టర్ బీ అనురాధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ… శాంతి భద్రత పరిరక్షణ నేరాల నియంత్రణలో జిల్లా పోలీస్ శాఖ ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటామన్నారు. చెడును పార తోలేందుకు పోలీస్ విభాగం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు రాంచందర్రావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు ధరణి కుమార్, పూర్ణ చందర్, ప్రసాద్, రాజేష్, విష్ణు ప్రసాద్, ఆర్ఎస్ఐలు రోహిత్, రంజిత్, బాలకృష్ణ, అంజయ్య, చిన్నకోడూర్ ఎస్ఐ బాలకృష్ణ, ఏఆర్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.