చెరువులో గురుకుల విద్యార్థి మృతదేహం లభ్యం

by Shiva |
చెరువులో గురుకుల విద్యార్థి మృతదేహం లభ్యం
X

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నారాయణఖేడ్ గురుకుల విద్యార్థి అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. రెండు రోజుల క్రితం మామిడి పళ్ల కోసం గురుకుల పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు బయటికి వెళ్లారు. ముగ్గురు తిరిగి రాగా 9వ తరగతి విద్యార్థి మహేష్ కనిపించకుండా పోయాడు. గురుకుల పాఠశాల సిబ్బంది శనివారం తల్లిదండ్రులకు సమాచారం అందజేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, ఆదివారం ఉదయం రామ సముద్రం చెరువులో విద్యార్థి మహేష్ శివమై కనిపించాడు. చెరువులో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మహేష్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనుమతి లేకుండా నలుగురు విద్యార్థులు గురుకులం నుంచి ఎలా బయటకు వెళ్లారని ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ ను తల్లిదండ్రులు ప్రశ్నించారు.

శనివారం నారాయణఖేడ్ లో కనిపించకుండా పోయిన మహేష్ రామసముద్రం చెరువులో ఎందకు శవమై కనిపించాడంటూ కుటుంబ సభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 3 కి.మీ దూరం ఏలా ప్రయాణించాడు.. ఎవరైనా తనను హతమార్చి ఇక్కడ పడేసి ఉంటారని అనుమాన వ్యక్తం చేశారు. తన కొడుకు మహేష్ మృతి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story