'నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం.. అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం'

by Vinod kumar |
నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం.. అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: బీఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరిపల్లి చంద్రం, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ బొమ్మల యాదగిరి, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ లక్కరసు సూర్యవర్మ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా కష్టపడి చదువుతున్న నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వ నీళ్లు చల్లిందన్నారు.

పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వ పెద్దల హస్త ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తే సరైన విచారణ జరుపకుండా విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం పోలీసుల చేతకాని తనానికి నిదర్శనమన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో సంబంధం ఉన్న వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనారిటీ ఉపాధ్యక్షుడు కలిముద్దీన్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వహాబ్, జిల్లా జనరల్ సెక్రెటరీ షాబుద్దీన్ మున్నా తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed