పెద్ద చెరువు సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌

by Shiva |
పెద్ద చెరువు సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌
X

దిశ, అందోల్‌: పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనుల్లో మరింత వేగం పెంచాలని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ అన్నారు. ఆదివారం చెరువు కట్ట సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చెరువు కట్ట పనుల కోసం రూ.2.55 కోట్లను మంజూరు చేసిందన్నారు. పనులను నాణ్యతగా చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ నిధులతో కట్టపై వాకింగ్‌ ట్రాక్, మురికి కాలువల నిర్మాణంతో పాటు ఇతరత్రా పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న మొరం పనులను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పనులను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించి, నాణ్యతగా జరిపించాలన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ ఇన్ చార్జి ఏఈ విఠోబా, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ పి.నారాయణ, కాంట్రాక్టర్‌ నాగిరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశం, వర్క్‌ ఇన్స్పెక్టర్ మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story