- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షేమంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్
దిశ, సంగారెడ్డి: సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని జిల్లా గ్రంథాలయం ఆడిటోరియంలో 120 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణానికి చెందిన 93 మంది, మండలానికి చెందిన 27 మంది మొత్తం 120 మందికి రూ.కోటి 20 లక్షల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలిపారు.రాష్ట్రం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమపాళ్లల్లో అందిస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.
రాష్ట్రంలో ఇంత గొప్ప సంక్షేమాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ అతి పవిత్రమైన మాసంలో చెక్కులు అందుకోబోతున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయ లక్ష్మి , తహసీల్దార్ విజయ్ కుమార్, జడ్పీటీసీ సునీత, మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు ఆర్.వెంకటేశ్వర్లు , పట్టణ కార్యదర్శి పెరుమాండ్ల నర్సింహులు, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, మండలాధ్యక్షులు చక్రపాణి, కౌన్సిలర్లు షేక్ సాబేర్, అశ్విన్, సోహిల్ అలీ, అమీర్, బీఆర్ఎస్ నాయకులు నక్క నాగరాజ్ గౌడ్, యాకూబ్ అలీ, అజ్జు, జలేందర్ రావ్, శ్రావణ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.