- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు..: కేసీఆర్
దిశ, ములుగు : బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనకు గిదో లెక్కనా..? అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం కూడా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొనసాగింది. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తది. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం. బీఆర్ఎస్ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్క కాదు. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుంది. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకునే సత్తా.. బీఆర్ఎస్‌కు మాత్రమే ఉంది. కొన్ని సార్లు అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోతారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. మనం ఏ హోదాలో ఉన్న ప్రజల కోసం పని చేయాల్సిందే అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నాయకులు, ప్రజలతో సమావేశం కంటే ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల, హుజురాబాద్ ఎమ్మెల్యేలు డా. సంజయ్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎల్ రమణ, జగిత్యాల జడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపెల్లి బీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు.