- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడకంచి పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
సర్పంచ్, ఉప సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు
ఆకస్మికంగా తనిఖీల్లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు
దిశ, గుమ్మడిదల : జిన్నారం మండల పరిధిలోని కొడకంచి, సోలక్ పల్లి గ్రామాల్లో గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొడకంచి గ్రామ పరిధిలో పారిశుధ్య కార్యక్రమంతో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ, రోడ్లు, మురికి కాలువలు శుభ్రంగా లేకపోవడంతో, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను పంచాయతీ జూనియర్ కార్యదర్శి సాధనను సస్పెండ్ చేశారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఉత్తర్వులను జారీ చేశారు. అనంతరం.. రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట డీఎల్పీవో సతీష్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.