విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాలి

by Sridhar Babu |
విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాలి
X

దిశ, సంగారెడ్డి : పిల్లలకు ఇప్పటి నుంచే నైతిక విలువలు నిర్ఫించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. జిల్లాలో 127 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలన్నారు. విద్యార్థులకు నైతిక విలువలు లేకపోవడం వల్ల వారి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారన్నారు. పాఠాలు చెప్పడమే కాకుండా బ్లాక్ బోర్డుపై వారితో రాయించి పాఠాలు చెప్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. తనకు కూడా చిన్నప్పుడు విద్యార్థులు బ్లాక్ బోర్డుపై పాఠాలు రాసి నేర్పిస్తేనే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అన్నారు.

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు యూనియన్లను పక్కన బెట్టి విద్యార్థులకు చదువు చెప్పాలన్నారు. తాను కూడా గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశానని చెప్పారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లుగా టీచర్లకు ప్రమోషన్లు రాలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక ప్రమోషన్లు ఇచ్చామన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలను బాగు చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయ దినోత్సవానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, వివిధ పాఠశాలల టీచర్లు, ఉత్తమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed