- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
by Shiva |
X
దిశ, ఝరాసంగం : ఫర్టిలైజర్ దుకాణాలలో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ టీం వ్యవసాయ సంచాలకులు పుష్ప హెచ్చరించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి వెంకటేశం, ఎస్సై అంబాజీతో కలిసి వారు దాడులు నిర్వహించారు. దుకాణాల్లో ఎరువులు, విత్తనాల విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విత్తనాలు, ఎరువులను విక్రయించిన సమయంలో రైతులకు తప్పనిసరిగా రశీదులను ఇవ్వాలని సూచించారు. తప్పనిసరిగా ఫర్టిలైజర్ దుకాణాల దారులు వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ తీసుకోనాలని దుకాణాలకు హెచ్చరించారు. రోజు స్టాక్ ను బోర్డుపై రాయాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Advertisement
Next Story