- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదానికి దారి తీసిన సోషల్ మీడియా పోస్టులు
దిశ, గుమ్మడిదల: సోషల్ మీడియాలో పోస్టుల కారణంగా వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఘటన జిన్నారం మండల పరిధిలో చోటు చేసుకుంది. జిన్నారం మండలం మంగంపేట గ్రామానికి చెందిన భాస్కర్ అనే యువకుడు ఇటీవల సోషల్ మీడియా గ్రూపులో పలు పోస్టులను పోస్ట్ చేశాడు. దీని కారణంగా పలువురు భాస్కర్ ను వ్యక్తిగతంగా హెచ్చరించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం పటాన్ చెరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం బాధితుడుని పరామర్శించాడు. వైద్యులను ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకుని, బాధితుడికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించేలా బహిరంగంగా దూషించి అవమానించండం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, మంగంపేట్ నాయకులు నరేందర్, తదితరులు పాల్గొన్నారు.