- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Singur Dam : నీటితో కళకళలాడుతున్న సింగూరు ప్రాజెక్టు..
దిశ, చౌటకూర్ : పుల్కల్ మండలం పరిధిలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తున్నది. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాలైన పుల్కల్, వట్పల్లి, రేగోడు, మనూరు, నావల్లగిద్ద, న్యాల్కల్, రాయికోడ్, ఝరాసంగం, మనిపల్లి, మండలాలలోని వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాలలో, కాలువలు, వాగులు గుండా, వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికైనా ఆయా ప్రాంతాలలోని చెరువులు కుంటలు సైతం నిండి పొంగిపోర్లు తున్నాయి. దీంతో ఆ నీరంతా సింగూరు జలాశయం చేరుతుండగా రోజురోజుకి నీటి మట్టం పెరుగుతున్నది.
523.600 మీటర్లకు 29.917 టీఎంసీలు నీటి నిలువ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు గురువారం మధ్యాహ్నం 2.00 గంటలకు రాత్రి వరకు 522.200 మీటర్లకు 22.590 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర ప్రజలకు ద్వారా తాగునీటి అవసరాలకు హెచ్ఎండబ్ల్యుఎస్ ద్వారా 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి అవసరాలకు 70 క్యూసెక్కులు, ఆవిరిగా 235 క్యూసెక్కులు నమోదయ్యాయి. ఇన్ ఫ్లో 20900 క్యూసెక్కులు నమోదయింది. అవుట్ ఫ్లో 385 క్యూసెక్కులు నమోదయిందన్నారు.