- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టరేట్ మొదటి అంతస్తులో షాట్ సర్క్యూట్
దిశ, సంగారెడ్డి బ్యూరో : దిశ హెచ్చరించినట్లే అయ్యింది. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం బట్టబయలైంది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఓకే చోట ఉండే జిల్లా కలెక్టరేట్ లో ఫైర్ సేఫ్టీ డొల్లతనం తేలిపోయింది. రాష్ట్రంలోనే అతిపెద్ద కలెక్టరేట్ గా గుర్తింపు పొందిన సంగారెడ్డి కలెక్టరేట్ లో ఫైర్ సేఫ్టీ ని పట్టించుకోలేదు. ఎప్పుడో కాలం చెల్లిన మంటలార్పే పరికరాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో వాటిలో రీఫిల్ చేయకపోవడం గమనార్హం. కాగా సోమవారం కలెక్టరేట్ మొదటి అంతస్తులోని సీపీఓ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలు ఫైళ్లు కాలిపోయాయి. అయితే కొద్ది రోజుల క్రితమే ‘దిశ’ లో కలెక్టరేట్ లో ఫైర్ సెఫ్టీపై ప్రత్యేక కథనం వచ్చిన విషయం తెలిసిందే. ముందే హెచ్చరించినా అధికార వ్యవస్థ పెద్దగా స్పందించలేదు. చివరకు ప్రమాదం జరిగిన తరువాత ఇప్పుడు ఆయా అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. కాగా ఆ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి విచారణకు ఆదేశించారు.
సీపీఓ కార్యాలయంలో షార్ట్ సర్య్కూట్
కలెక్టరేట్ మొదటి అంతస్తులోని సీపీఓ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలు పలు ఫైళ్లు కాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ వల్లూరి క్రాంతి తక్షణమే స్పందించారు. సీపీఓ కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. ఫైళ్లు, ఇతర వివరాలు కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ లోని అన్ని శాఖల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ట్రాన్స్కో, ఫైర్ శాఖల అధికారులను విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలన్నారు. షాట్ సర్క్కూట్ కు ఖచ్చితమైన కారణాలను విచారణలో తేల్చాలని ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయాల భద్రత ప్రమాణాలను పరిశీలించాలని, ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేస్తున్నాయా..? లేదా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్ని ఫైళ్లు కాలిపోయాయి..? విలువైనవా..? వేటికి సంబంధించిన ఫైళ్లు..? ఇలాంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్ని ఉన్నది.
ముందే హెచ్చరించిన ‘దిశ’...
సంగారెడ్డి కలెక్టరేట్ లో 45 ప్రభుత్వ కార్యాలయాలు వరకు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ మొదలుకుని అన్ని శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలున్నాయి. కలెక్టరేట్ లో ఉండే బహుళ అంతస్తుల భవనాలకు మొత్తం కలిపితే 15 మాత్రమే ఏబీసీ డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటిది ఒక్కో కార్యాలయానికి ఒక్కో పరికరం ఉండాలి. కానీ ఆ నిబంధనలు ఇక్కడ కనిపించడం లేదు. మొత్తానికి 15 ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ ఫైర్ సేఫ్టీ పరికరాలు గడువు ముగిసిన ఐదు నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వాటిని రీఫిల్ చేయాల్సి ఉండగా తనకు రావాల్సిన బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ పట్టించుకోలేదు.
23-06-2024తోనే వాటి గడువు ముగిసింది.ప్రతి ఏడాదికి ఓ సారి వీటిని రీఫిల్ చేయాల్సి ఉంటుంది. అధికారులు మాత్రం ఆ విషయాన్ని కనీసం లెక్కచేయలేదు. అయితే తనకు సుమారు రూ.6.50 లక్షల బిల్లు రావాల్సి ఉన్నదని, ఎన్ని సార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగిన ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆ క్రమంలోనే రిపీల్ చేయలేకపోయానని కాంట్రాక్టర్ వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. కలెక్టరేట్ లో ఫైర్ సేఫ్టీ పరిస్థితిపై ఇటీవల ‘దిశ’కథనం వచ్చిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని ముందే హెచ్చరించింది కూడా. తీరా ప్రమాదం జరిగిన తరువాత ఫైర్ సేఫ్టీ పరికరాలను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరిని బాధ్యులను చేస్తారో చూడాల్సి ఉంది.