Short circuit : ఎలిమినేటర్ కనెక్టర్స్ లో షార్ట్ సర్క్యూట్… రూ. 90 లక్షల ఆస్తి నష్టం

by Kalyani |
Short circuit : ఎలిమినేటర్ కనెక్టర్స్ లో షార్ట్ సర్క్యూట్… రూ. 90 లక్షల ఆస్తి నష్టం
X

దిశ, చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎలిమినేటర్ కనెక్టర్స్ మొలల కంపెనీలో శుక్రవారం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో 90 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు కంపెనీ మేనేజర్ జై కిసాన్ తెలిపారు. మండల కేంద్రంలో ఎలిమినేటర్ కనెక్టర్స్ మొలల కంపెనీ యాజమాన్యం షెడ్డులో కాటన్స్, ఇతర సామాగ్రి నిల్వ ఉంచగా, షాట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో,యాజమాన్యం కార్మికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైరింజన్లు తెప్పించి, గ్రామంలోని ఇతర వాటర్ ట్యాంకులను పిలిపించి, మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే అందులో ఉన్న ఒక షెడ్డు కాటన్స్ పూర్తిగా దగ్ధమైందని కంపెనీ మేనేజర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed