రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో ర్యాంక్ సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థిని

by Shiva |
రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో ర్యాంక్ సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థిని
X

దిశ, దౌల్తాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలకు చెందిన బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కారింగుల వర్ష (985) మార్కులతో రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో ర్యాంక్ సాధించింది. మహాత్మ జ్యోతి బాపూలే బీసీ రెసిడెన్షియల్ విద్యార్థులు సత్తా చాటారు. మొదటి సంవత్సరం సీఈసీ లో ఎంజేపీకి చెందిన చెంచు మహేష్ (430) బైపిసీలో ప్రభుత్వ కళాశాలకు చెందిన చిడుగు సంధ్య (391) ఎంపీసీలో ఎంజేపీకి చెందిన నగేష్(454) మండలంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో సీఈసీలో ఎంజేపీకి చెందిన మెతుకు తరుణ్ (947), ఎంపీసీలో ఎంజేపీకి చెందిన లక్ష్మణ్ (969) మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.

Advertisement

Next Story