- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR వల్లే పేదోడి సొంతింటి కల నెరవేరింది.. SHDC చైర్మన్ చింతా ప్రభాకర్
దిశ, కంది: కేసీఆర్ వల్లే పేదోడి సొంతింటి కల నెరవేరిందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కాశీపూర్ శివారులో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీతో పాటు జిల్లా కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. అనంతరం మొత్తం 96 మందికి ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందజేస్తున్నామని చెప్పారు. ఒకేసారి ఇంతమంది సొంత ఇళ్లల్లోకి రావడం ఆనందంగా ఉందని, త్వరలో సొంత స్థలం ఉన్నవాళ్లందరికీ ఇండ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి మాట్లాడుతూ.. పోరాడా తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని చెప్పారు.
అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో రూ.300 కోట్లతో 5,745 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలోనే రూ.6 కోట్లతో 96 ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించామని పేర్కొన్నారు. ఇండ్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే మిగతావాళ్లకు కూడా ఇండ్లు వస్తాయని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇక జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతమంది పేదలకు ఒకేసారి సొంతింటి కల నెరవేరినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, ఎంపీపీ సరళ పుల్లారెడ్డి, జడ్పిటిసి కొండల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కంది సర్పంచ్ విమల, కాశీపూర్ సర్పంచ్ జుబేదాబేగం, ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.