- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల కోసమే పథకాలు.. మైనంపల్లి హనుమంతరావు
దిశ, చేగుంట : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలోనే కొత్తపథకాలు ప్రవేశపెట్టి ప్రజల దృష్టిని మరల్చి ఓట్లు దండుకోవడమే అలవాటుగా మారిందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. నర్సింగ్ మండల పరిధిలోని జప్తి శివునూరు గ్రామంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కొత్తపథకాలు ప్రవేశపెట్టడం ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
సంక్షేమ పథకాలు నిరుపేదలకు చేరడం లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టిందని రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై బెదిరింపులకు పాల్పడుతూ కేసులునమోదు చేసే అధికారుల పై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత మండప నిర్వహకులకు సన్మానించారు. జప్తి శివనూర్ గ్రామానికి చెందిన కే.మోహన్, ప్రశాంత్, సత్తయ్య, శంకర్, రాములు, సిద్దయ్య, తాటి సిద్ధయ్య, బిక్షపతి, మంగళ శంకర్, కమ్మరి రాజు, బిక్షపతి, మైనారిటీ నాయకులు షేక్ సోహెల్, గౌస్, చిన్న షరీఫ్, నాగరాజు, పోచయ్య, భూమయ్యతో పాటు అన్ని కులాలకు చెందిన 70 మంది పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో నర్సింగ్ మండల పార్టీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగార్ల గోవర్ధన్, శంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మైనార్టీ జిల్లా నాయకుడు రుక్ముద్దీన్, మేడి గణేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.