- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లికి నో చెప్పిందని.. వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
పోలీసుల జోక్యంతో.. కథ సుఖాంతం
దిశ, జహీరాబాద్ : ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని రంజోల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మొగుడంపల్లి మండల పరిధిలోని మన్నాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. తీరా పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించడంతో, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ, గౌరవంతో ఆ యువతి పెళ్లికి నిరాకరించింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి తన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్నేహితులు ఎంత నచ్చజెప్పిన వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే రంగంలోకి దిగిన జహీరాబాద్ రూరల్ ఏఎస్ఐ.కాంతారావు చాకచక్యంగా వ్యవహరించి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆ యువకుడు ట్యాంక్ మీద నుంచి కిందకు దిగాడు.