పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు మద్దతుగా పంచాయతీకి తాళం వేసిన సర్పంచ్

by Shiva |   ( Updated:2023-05-02 13:05:07.0  )
పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు మద్దతుగా పంచాయతీకి తాళం వేసిన సర్పంచ్
X

దిశ చేగుంట : రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మద్దతుగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి మద్దతు ప్రకటించాడు ఓ సర్పంచ్. చేగుంట మండల పరిధిలోని పోతాంశెట్టిపల్లి పంచాయతీ కార్యాలయానికి వేరే కార్యదర్శిని నియమించోద్దంటూ గ్రామ సర్పంచ్ నెల్లూరు పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. నాలుగేళ్లుగా ప్రొబేషనరీ పీరియడ్ అనంతరం క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించినా క్రమబద్ధీకరణ చేయకపోవడంతో ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు మద్దతుగా పోతాంశెట్టిపల్లి గ్రామ సర్పంచ్ నెల్లూరు, ఉప సర్పంచ్ నాగేందర్ రెడ్డి సంఘీభావం ప్రకటించి కార్యాలయానికి తాళం వేసి అండగా ఉంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story