Sangareddy DSP : డ్రగ్స్ వల్ల సమాజానికి అనర్థాలు

by Aamani |
Sangareddy DSP : డ్రగ్స్ వల్ల సమాజానికి అనర్థాలు
X

దిశ,సంగారెడ్డి : డ్రగ్స్ మహమ్మారి వల్ల సమాజానికి ఎన్నో అనర్థాలు జరుగుతాయని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని ఇస్టా జూనియర్ కళాశాలలో ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతాయన్నారు. ఆరోగ్యం పాడు కావడంతో పాటు ఆ మత్తులో ఏమి చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందన్నారు.

అందువల్ల మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ వలన భావి సమాజానికి జరిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ మార్గదర్శనం చేశారు. ఇష్టా జూనియర్ కళాశాల డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇస్టా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్‌ల అంతిమ లక్ష్యం పిల్లల సమగ్ర అభివృద్ధి అని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవి కిరణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఇబ్రహీం, మరియు కళాశాల లెక్చరర్ బృందం మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed